జగనరెడ్డి అసత్య ప్రచారాలను మానుకోవాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:06 AM
అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో తనకు సరైన భద్రత కల్పించడం లేదని జగనరెడ్డి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు రూరల్ ఏప్రీల్ 10(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో తనకు సరైన భద్రత కల్పించడం లేదని జగనరెడ్డి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. కర్నూలు ఎంపీ నాగరాజు తన కార్యలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ నేరపూరితమైన ఆలోచనలు కలిగిన జగనకు ప్రజలు ప్రతిపక్షహోదా కూడా ఇవ్వలేదని అయినప్పటికీ ఆయనకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. సంతాపం తెలపడానికి వెళ్లిన వ్యక్తి రోడ్లవెంబడి జనాన్ని రప్పించుకొని పోలీసుల వైఫల్యం అంటు మాట్లాడటం సరికాదన్నారు. పైగా తన ప్రభుత్వం వస్తే పోలీసులను బట్టలు ఊడగొట్టిస్తానంటూ జగనరెడ్డి చేసిన వ్యాఖ్యాలను ఎంపీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో పోలీసులే లేకపోతే వ్యవస్థ ఏవింధంగా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు.