Pulivendula: చంద్రన్న జలాలకు జగన్ హారతులు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:34 AM
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు 2017లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే కృష్ణా జలాలను రప్పించారు.
పులివెందుల, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు 2017లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే కృష్ణా జలాలను రప్పించారు. ఇప్పుడు... అవే జలాలకు జగన్ హారతులు ఇచ్చి, పూజలు చేశారు. మంగళవారం పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని అంబకపల్లె గ్రామంలో గంగమ్మకుంటలో నింపిన కృష్ణా జలాలకు జగన్ జలహారతి ఇచ్చా రు. నిజానికి... గత టీడీపీ హయాంలోనే లింగాల కుడికాల్వ నుంచి ఎత్తిపోతల ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హిరోజుపురం వరకు పైప్‌లైన్ వేశారు. తాజాగా... ఆ పైప్‌లైన్‌ను గంగమ్మకుంట చెరువు వరకు పొడిగించారు. ఇందుకోసం అవినాశ్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ చెరువుకు చేరిన కృష్ణా జలాలకే జగన్ పూజలు చేశారు.