Share News

ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నారు: అనిత

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:53 AM

ప్రతిపక్షం హోదా కావాలని అడుక్కునే పరిస్థితి జగన్‌కు వచ్చిందని హోం మంత్రి అనిత ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నారు: అనిత
Vangalapudi Anitha

ఆకివీడు, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షం హోదా కావాలని అడుక్కునే పరిస్థితి జగన్‌కు వచ్చిందని హోం మంత్రి అనిత ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘చంద్రబాబును జైల్లో పెట్టి.. జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. డిప్యూటీ స్పీకర్‌ ట్రిపుల్‌ ఆర్‌ తనకు జరిగిన, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిరోజూ మీడియా, వీడియోల ద్వారా ప్రజలను మోటివేట్‌ చేశారు. వైసీపీ హయాంలో ప్రజలే కాదు.. మేమూ బాధితులమే’ అని అనిత అన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 07:55 AM