Share News

అప్పు దొరకని స్థితికి తెచ్చాడు: మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:57 AM

గత వైసీపీ పాలనలో జగన్‌ ఆర్థిక అరాచకాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధికి అప్పులు తెచ్చే అవకాశం కూడా లేని దుస్థితి నెలకొంది అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

అప్పు దొరకని స్థితికి తెచ్చాడు: మంత్రి పయ్యావుల

నందిగామ, జూలై 28(ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ పాలనలో జగన్‌ ఆర్థిక అరాచకాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధికి అప్పులు తెచ్చే అవకాశం కూడా లేని దుస్థితి నెలకొంది’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. సోమవారం కూటమి ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో అన్ని వనరులనూ ఆర్థిక నేరస్థుడైన జగన్‌ దోచుకున్నాడు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి దోచుకోవడానికే అడ్డగోలుగా అప్పులు చేశాడు. జగన్‌ అరాచక పాలన వల్ల నేడు రాష్ట్రానికి అప్పు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత సంక్షోభంలోనూ సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారు. ప్రజలు, పార్టీ నాయకులు కొంత సంయమనం పాటించాలి’ అని మంత్రి కోరారు.

Updated Date - Jul 29 , 2025 | 05:58 AM