CBI Court: జగన్ మెమోపై నేడు విచారణ
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:19 AM
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ భవిష్యత్‌లో ఎలాంటి విదేశీ పర్యటనలకు వెళ్లకుండా...
హైదరాబాద్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ భవిష్యత్‌లో ఎలాంటి విదేశీ పర్యటనలకు వెళ్లకుండా ఆదేశాలివ్వాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈనెల 14వ తేదీలోపు జగన్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై ఆయన మెమో దాఖలు చేయడం తెలిసిందే. తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతే రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని, ఆన్‌లైన్‌లో హాజరవుతానని అందులో విజ్ఞప్తిచేశారు. దీనిపై కౌంటర్ వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆయన మెమోపై మంగళవారం మరోసారి విచారణ జరుగనుంది.