Share News

జగన్‌ లక్కీ నంబరు 11: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:56 AM

జగన్మోహన్‌ రెడ్డి లక్కీ నంబరు 11 అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

జగన్‌ లక్కీ నంబరు 11: బుద్దా వెంకన్న

విజయవాడ (వన్‌టౌన్‌), జూలై 31 (ఆంధ్రజ్యోతి): జగన్మోహన్‌ రెడ్డి లక్కీ నంబరు 11 అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో ఆకు రౌడీలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌, జోగి రమే్‌షల వద్ద పేర్ని నాని ప్రతినెలా పేమెంట్‌లు తీసుకుని మాట్లాడుతున్నాడని విమర్శించారు. పేర్ని నానికి దమ్మూ ధైర్యం ఉంటే బియ్యం స్కామ్‌పై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఒక యాప్‌ ప్రారంభిస్తామని జగన్‌చెబుతున్నారని, అయితే కూటమి ప్రభుత్వంలో ఎవరూ కష్టాలు పడటం లేదని చెప్పారు. కానీ, జగన్‌ రెడ్డి వైసీపీ పాలనలో కల్తీ మద్యం వల్ల ఎంత మంది చనిపోయారు, ఎన్ని తాళిబొట్లు తెగిపోయాయి, ఇంకా జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలను తెలుసుకోవటానికి యాప్‌ను జగన్‌ ప్రారంభిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీకి గత ఎన్నికల్లో 11 సీట్లు ప్రజలు కట్టబెట్టారని, హైదరాబాద్‌లో లిక్కర్‌ స్కామ్‌లో మొదట దొరికిన డబ్బులు 11 కోట్లు కాబట్టి జగన్మోహన్‌ రెడ్డి లక్కీ నంబరు 11 అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక నుంచి జగన్‌ను 11 అంటామని తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 06:57 AM