Share News

Nimmala Ramana Naidu: జగన్‌ మెక్కిన సొమ్మంతా కక్కిస్తాం

ABN , Publish Date - Jul 20 , 2025 | 05:46 AM

దేళ్ల పాలనలో అక్రమాలతో జగన్‌ అండ్‌ కో లూటీ చేసిన రూ.40 వేల కోట్ల ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం కక్కించకుండా వదిలిపెట్టబోదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Nimmala Ramana Naidu: జగన్‌ మెక్కిన సొమ్మంతా కక్కిస్తాం

  • బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు: నిమ్మల

చోడవరం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో అక్రమాలతో జగన్‌ అండ్‌ కో లూటీ చేసిన రూ.40 వేల కోట్ల ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం కక్కించకుండా వదిలిపెట్టబోదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం అనకాపల్లి జిల్లా చోడవరానికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే కేఎ్‌సఎన్‌ఎస్‌ రాజు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇసుక, ఖనిజాలు, వనరుల దోపిడీతో పాటు, మద్యం వ్యాపారంలో కోట్లాది రూపాయలు స్వాహా చేసిన జగన్‌.. ఆ తప్పులకు శిక్ష తప్పదన్న భయంతోనే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ ఉండదని తెలంగాణలోని రాజకీయ నాయకులు, మేధావులు, రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు, జర్నలిస్టులు.. అందరికీ తెలుసన్నారు. అక్కడిరాజకీయ పార్టీల ఆధిపత్య పోరులో భాగంగానే బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో ఏడాది పాలన పట్ల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని నిమ్మల తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబరు నెలాఖరుకల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 05:47 AM