Share News

జగన్‌ది జైళ్ల యాత్ర: అనిత

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:13 AM

పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్‌ వెళ్లి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను కలిస్తే..

జగన్‌ది జైళ్ల యాత్ర: అనిత

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్‌ వెళ్లి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను కలిస్తే.. జగన్‌ మాత్రం జైళ్లకు వెళ్లి ఖైదీలు, దోపిడీదారులు, ఖూనీకోర్లను కలుస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. అమరావతి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తీర్థయాత్రలు, జైత్రయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూశాం.. ఇప్పుడు జగన్‌ జైలు యాత్రలు చూస్తున్నాని ఎద్దేవా చేశారు. ‘మీ పర్యటనలో ఓ కానిస్టేబుల్‌ చేయి విరిగితే.. పోలీసుల వైఫల్యమంటూ మాట్లాడతారా? చంద్రబాబు, లోకే్‌షను తిడుతున్న జగన్‌ మానసిక స్థితిపై చర్చ జరగాలి’ అని అనిత పేర్కొన్నారు. ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపిక ఫలితాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని హోంమంత్రి వెల్లడించారు.

Updated Date - Aug 01 , 2025 | 06:15 AM