Minister Kollu Ravindra: రాష్ట్రానికి పట్టిన చీడపురుగు జగన్
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:12 AM
రాష్ట్రానికి పట్టిన చీడపురుగు జగన్‌రెడ్డి అని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు
సూపర్ సిక్స్... సూపర్ హిట్ సభ సూపర్ డూపర్ హిట్
తట్టుకోలేకే జగన్‌రెడ్డి కుట్రలు: మంత్రి కొల్లు
విజయవాడ (వన్‌టౌన్), సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పట్టిన చీడపురుగు జగన్‌రెడ్డి అని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తాం, పెట్టుబడుల్ని తరిమేస్తాం, కూల్చేస్తామని జగన్‌రెడ్డి వ్యాఖ్యానించడం అత్యంత హేయం. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగానే అమరావతి, పోలవరం పనులు పడకేశాయి. ఇప్పుడు వాటి వ్యయం పెరిగి రాష్ర్టానికి భారంగా మారింది. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అది చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై జగన్ కుట్రలు చేస్తున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఏడాది కాలంలోనే అమలు చేశాం. ప్రజలు సంతోషంగా ఉండడం నచ్చక, కూటమి ప్రభుత్వంపై జగన్ కుట్రలు చేస్తున్నాడు. ఎరువుల పేరుతో రైతుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దేవాలయాల ఆస్తులపై జగన్ నీచ రాజకీయం చేస్తున్నాడు. విజయవాడ ఫెస్టివల్ కోసం దేవాలయ భూములను 40 రోజులు వాడుకుంటున్నాం. అందుకు సొమ్ము చెల్లిస్తామని చెప్పాం. దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందంపై బురద జల్లేలా వ్యాఖ్యానించటం దుర్మార్గం’ అని మంత్రి కొల్లు విమర్శించారు.