Share News

జగన్‌... దమ్ముంటే అసెంబ్లీకి రా: మంత్రి సవిత

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:17 AM

యూరియా, ఉల్లి, మెడికల్‌ కళాశాలలు.. ఇలా ఏ అంశంపైనైనా చర్చించడానికి దమ్ముంటే జగన్‌ అసెంబ్లీకి రావాలని మంత్రి సవిత సవాలు విసిరారు.

జగన్‌... దమ్ముంటే అసెంబ్లీకి రా: మంత్రి సవిత

హిందూపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): యూరియా, ఉల్లి, మెడికల్‌ కళాశాలలు.. ఇలా ఏ అంశంపైనైనా చర్చించడానికి దమ్ముంటే జగన్‌ అసెంబ్లీకి రావాలని మంత్రి సవిత సవాలు విసిరారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్మాణం ఆగిపోయిన మెడికల్‌ కళాశాల ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వీవీ ఆంజనేయులు, పార్టీ నేత నరసింహరావులతో కలసి సోమవారం ఆమె పరిశీలించారు. వైసీపీ హయాంలో ఎంతమేర పనులు జరిగాయో మీడియాకు చూపించారు. సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం పెనుకొండలోని జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో స్మార్ట్‌ పే ఫోన్‌ను ప్రారంభించారు.

Updated Date - Sep 09 , 2025 | 06:18 AM