Share News

Minister Kolusu Parathasarathy: జగన్‌కు భయం పట్టుకుంది

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:59 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి, ఫ్రస్ర్టేషన్‌తో జగన్మోహన్‌రెడ్డి ఉచ్ఛనీచాలు మరిచి, మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు.

Minister Kolusu Parathasarathy: జగన్‌కు భయం పట్టుకుంది

  • ఫ్రస్ర్టేషన్‌తోనే చంద్రబాబుపై దూషణలు: కొలుసు

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి, ఫ్రస్ర్టేషన్‌తో జగన్మోహన్‌రెడ్డి ఉచ్ఛనీచాలు మరిచి, మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌లో భయం బయట పడుతోందని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నాయకులు హుందాగా ఉండాలి. వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదు. కానీ జగన్‌ ఇందుకు పూర్తి విరుద్ధం. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్‌ రాయుళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తారా? జగన్‌లో హుందాతనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి నైతిక విలువలతో రాజకీయాలు చేయాలి. కింది స్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలి. కానీ జగన్‌ అనైతికంగా, అప్రజాస్వామికంగా, విధ్వంసకర ఘటనలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గర మంత్రులు సరిగ్గా మాట్లాడకపోతే మందలించేవారు. భాష మార్చుకోవాలని చెప్పేవాళ్లు. కక్ష పూర్తి రాజకీయాలు వద్దని చంద్రబాబు కూడా చెప్తుంటారు. ప్రజలతో మంచి సంబంధాలు నెరుపుతూ, రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని చెప్తుంటారు. కానీ జగన్‌ ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలి. వైసీపీ నేతల దోపిడీలు, అరాచకాల నుంచి ప్రజల డైవర్ట్‌ చేయడానికి నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంతో.. గత ప్రభుత్వంలో మాదిరిగా దొంగచాటుగా పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చే పరిస్థితులు లేవు. లిక్కర్‌స్కామ్‌లో ఇప్పుడు బయటపడుతున్న నగదు చూస్తుంటే దోపిడీ ఏస్థాయిలో జరిగిందో అర్థంచేసుకోవచ్చు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు’ అని అన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 04:59 AM