జగన్ భ్రష్టు పట్టించారు..లోకేశ్ గాడిన పెట్టారు: భూమిరెడ్డి
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:43 AM
జగన్ భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థను లోకేశ్ గాడిన పెట్టారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు.
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): జగన్ భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థను లోకేశ్ గాడిన పెట్టారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను జగన్ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్...దేశంలో పేరెన్నికగన్న అనేక మంది ఆచార్యులను, ఉన్నత విద్యావంతులను ఉపకులపతులుగా నియమించారు. వఏడాదిలోనే విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అనేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు’ అని అన్నారు.