MLA Chintamaneni Prabhakar: దోపిడీదారులకు జగన్ ఆశీస్సులు
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:49 AM
వైసీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
వైసీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టడం తథ్యం: చింతమనేని
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘దోపిడీదారులకు జగన్, వైసీపీ నేతలు ఆశీస్సులు అందిస్తున్నారు. అందుకే జైలు యాత్రలు, దోపిడీ దొంగల పరామర్శలు చేస్తున్నారు. తాను చేసిన దోపిడీకి భార్యను కేసులో ఇరికించి, ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో పారిపోయిన పేర్ని నాని కూడా చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై నోరు పారేసుకుంటున్నాడు. చేపల దొంగతనానికి పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచరవర్గమంతా వచ్చింది. కొల్లేరుకు వలస పక్షులు వచ్చినట్లు అప్పుడప్పుడు దెందులూరుకు అబ్బయ్య చౌదరి వస్తాడు’ అని చింతమనేని విమర్శించారు.