Share News

Health Commissioner Veerapandian: ఐవీఆర్‌ఎస్‌ ద్వారా గర్భిణులకు ఆరోగ్య సూచనలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:33 AM

మాతా, శిశు మరణాల్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా గర్భిణులు, బాలింతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నామని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు.

Health Commissioner Veerapandian: ఐవీఆర్‌ఎస్‌ ద్వారా గర్భిణులకు ఆరోగ్య సూచనలు

  • ఆరోగ్యశాఖ కమిషనర్‌ వెల్లడి

అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మాతా, శిశు మరణాల్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా గర్భిణులు, బాలింతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నామని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ‘కిల్కారి’ (చిన్నారి చిరునవ్వు) కార్యక్రమం ద్వారా ఏటా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సగటున 2.5 లక్షల మంది గర్భిణులకు ఆరోగ్య సూచనలు ఇస్తున్నామని, ఈ ఏడాది కూడా దాదాపు రెండు లక్షల మందికి సూచనలు అందించామని అన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణ, పోషణ, టీకాల ప్రాముఖ్యం, కుటుంబ నియంత్రణ, ఇత ర అంశాలపై కనీసం 4 నిమిషాల పాటు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో నాలుగో నెలలోకి ప్రవేశించిన గర్భిణికి వారానికి ఒకసారి చొప్పు న ప్రసవం జరిగే వరకూ ఐవీఆర్‌ఎస్‌ వాయిస్‌ కాల్స్‌ వెళ్లేవని, ఇప్పుడు నెలకు ఒకసారి కాల్స్‌ వెళ్లేలా మార్పులు జరిగాయని వివరించారు.

Updated Date - Dec 27 , 2025 | 05:33 AM