పూజకు వేళాయె
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:24 PM
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగు, తాగునీటి అవసరాల కోసం అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో సప్తనదుల్లో నిక్షిప్తమై ఉన్న సంగమేశ్వరాలయం బయల్పడుతుంది.

సప్తనదుల నుండి బయల్పడుతున్న సంగమేశ్వరాలయం
కొత్తపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగు, తాగునీటి అవసరాల కోసం అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో సప్తనదుల్లో నిక్షిప్తమై ఉన్న సంగమేశ్వరాలయం బయల్పడుతుంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులకు గాను 844.50 అడుగులుగా నమోదైంది. అలాగే రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలకు గాను 69.1600 టీఎంసీలుగా నమోదైంది. దీంతో సంగమేశ్వరాలయ గోపురం మెలమెల్లగా బయల్పడుతూ వచ్చింది.. కేవలం 5 నుంచి 6 అడుగుల మేర శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం తగ్గినట్లయితే పూర్తిగా ఆలయం బయల్పడే అవకాశం ఉంది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే.. రానున్న ఉగాది పర్వదినానికి సంగమేశ్వరస్వామి భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది.