Visakhapatnam: ఐటీబీపీ కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:31 AM
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పందలపాక సమీపంలోని 56వ ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌లో ఒక కానిస్టేబుల్ (జీడీ) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు....
56వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘటన
ఆనందపురం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పందలపాక సమీపంలోని 56వ ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌లో ఒక కానిస్టేబుల్ (జీడీ) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు సీఐ చింతా వాసునాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఆర్‌ఎస్ రంగాపురం ప్రాంతానికి చెందిన జగదల నరేంద్రనాథ్ (32) ఐటీబీపీలో కానిస్టేబుల్‌గా (జీడీ)గా పనిచేస్తున్నారు. 2014లో పోలీస్ శాఖలో చేరిన నరేంద్రనాథ్ గత 15 నెలలుగా 56వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం గార్డు విధులు నిర్వర్తిస్తూ రాత్రి ఏడు గంటల ప్రాంతంలో బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు బెటాలియన్ ఇన్‌చార్జి సూరజ్ ప్రకాష్ జోషి ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సీఐ చింతా వాసునాయుడు, ఎస్‌ఐ సంతోష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. నరేంద్రనాథ్ కొంతకాలంగా మానసిక సమస్యతో బాపడుతున్నారని, గతంలో ఢిల్లీలో చికిత్స తీసుకున్నారని తెలిసింది. నెల రోజుల కిందట ఒకసారి ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం.