ఆర్టీసీ స్థలాలు ‘లులు’కు కట్టబెట్టడం తగదు
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:32 PM
కోట్లాది రూపాయల విలువైన గవర్నర్‌పేట రెండు డిపోలను ‘లులు’కంపెనీకి ఇవ్వడం ప్రభుత్వానికి తగద ని ఎన్‌ఎంయూ జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆనంద్ తెలిపారు.
ఎన్‌ఎంయూ జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆనంద్
పీలేరు రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): కోట్లాది రూపాయల విలువైన గవర్నర్‌పేట రెండు డిపోలను ‘లులు’కంపెనీకి ఇవ్వడం ప్రభుత్వానికి తగద ని ఎన్‌ఎంయూ జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆనంద్ తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం రెండో రోజు పీలేరు ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని కారు చౌకగా ‘లులు’ కంపెనీకి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ‘లులు’కు ఇచ్చిన ఆస్తులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు సీ.వీ. రమణ, జీ. ఆదినారాయణ, రీజనల్ నేతలు వీ.పీ. నాయుడు, టీ. మధుసూదన్, డిపో చైర్మన్ ఏ, ఆర్. చంద్ర, ట్రెజరర్ కే, రఘు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే, హరినాధ్, బీ. శివశంకర్, చాంద్ భాషా, కే.ఎస్. రామయ్య, పలువురు యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.