Katamaneni Bhaskar: రాష్ట్ర డేటా సెంటర్ సలహా మండలి ఏర్పాటు
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:47 AM
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేశ్ అధ్యక్షతన రాష్ట్ర డేటా సెంటర్ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అధ్యక్షుడిగా మంత్రి లోకేశ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేశ్ అధ్యక్షతన రాష్ట్ర డేటా సెంటర్ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో హైపర్‌స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్స్ డైరెక్టర్ శ్రీకాంత్ కామకోట, డేటా సెంటర్ ఆపరేటర్స్ శరద్ సంఘి, సామ్‌సన్ ఆర్థర్, జితేశ్ కర్లేకర్, లలిత్ ఖన్నా, కల్యాణ్ ముప్పనేని, ఇండస్ట్రీస్ విభాగం నుంచి ఆశిష్ అగర్వాల్, వినాయక్ గాడ్సే, రాజేశ్ చన్నా, విక్రమ్ గన్డోద్ర, దీపక్ శర్మ, అనిష్ షా, జీపీ రాజశేఖర్, ఎం.చంద్రశేఖర్, కేఎన్ సత్యనారాయణ, గీతాంజలి శర్మ, సంజయ్ బాహితో పాటు రాష్ట్ర అధికారులు ప్రఖర్‌జైన్, మల్లవరపు సూర్యతేజ, కాటమనేని భాస్కర్ ఉంటారు.