IT Companies: ఐటీ సంస్థలకు 125 కోట్ల రాయితీలు విడుదల
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:21 AM
రాష్ట్రంలో ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు రూ.125 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
విశాఖపట్నం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు రూ.125 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు ఏపీడీటీఐ నెట్‌వర్క్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు సోమవారం తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కొన్ని బకాయిలు ఉండిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులకు మాత్రమే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిపై దృష్టి పెట్టి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసిన వాటిలో రూ.125 కోట్లు విడుదల చేసింది.