BlueBird Communication Satellite: 24న బ్లూబర్డ్ ఉపగ్రహ ప్రయోగం
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:41 AM
ఇస్రో మరో వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన బ్లూబర్ట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని....
శాటిలైట్ ప్రిపరేషన్ బిల్డింగ్ నుంచి వ్యాబ్‌కు రాకెట్
సూళ్లూరుపేట, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇస్రో మరో వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన బ్లూబర్ట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈ నెల 24న రోదసిలోకి పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రోకు చెందిన అత్యంత శక్తిమంతమైన ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది. వాణిజ్య పరంగా ఇస్రో ప్రయోగిస్తున్న అత్యంత భారీ ఉపగ్రహాల్లో ఇదీ ఒకటి. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన పనులు షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (వ్యాబ్)లో శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం శాటిలైట్ ప్రిపరేషన్ బిల్డింగ్‌లో రాకెట్ శిఖర భాగాన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని అమర్చారు. అనంతరం ఉపగ్రహం చుట్టూ ఉష్టకవచం అమర్చే ప్రక్రియను పూర్తిచేసి రాకెట్‌ను వ్యాబ్‌కు తరలించారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 24న ఉదయం 8.10 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. అమెరికాకు చెందిన ఏఎ్‌సటీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. సమాచార రంగానికి చెందిన ఈ ఉపగ్రహాన్ని తొలుత ఈ నెల 21న ప్రయోగించాలని భావించినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు.