Share News

Sullurpet: 30న నింగిలోకి నిసార్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:26 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాసా భాగస్వామ్యంతో రూపొందించిన నాసా-ఇస్రో సింథటిక్‌...

Sullurpet: 30న నింగిలోకి నిసార్‌

  • జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు

సూళ్లూరుపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాసా భాగస్వామ్యంతో రూపొందించిన నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ మిషన్‌ (నిసార్‌) ఉపగ్రహ ప్రయోగానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి ఈనెల 30న జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా 2,392 కిలోల బరువున్న ‘నిసార్‌’ను ప్రయోగించనుంది. షార్‌లోని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ (వ్యాబ్‌)లో రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులతో పాటు ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా శాస్త్రవేత్తలు పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4:40 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది. భూ పర్యావరణ వ్యవస్థలతో పాటు వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు నిసార్‌ను కక్ష్యలోకి పంపుతున్నారు. ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లిన అనంతరం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూగోళాన్ని స్కాన్‌చేసి డేటాను అందించనుంది.

Updated Date - Jul 22 , 2025 | 10:18 AM