Bluebird Satellite: బ్లూబర్డ్ ప్రయోగం 21కి వాయిదా..
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:48 AM
ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్’ వాయిదా పడినట్టు తెలిసింది.
సూళ్లూరుపేట, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్’ వాయిదా పడినట్టు తెలిసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని తొలుత ఈనెల 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. కానీ.. రాకెట్ అనుసంధానంఆలస్యం కావడంతో ఈ ప్రయోగం ఈ నెల 21కి వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 21న షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి ఎగరనుంది. అయితే ప్రయోగా తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాకెట్‌లో వినియోగించే లిక్విడ్‌ను తమిళనాడులోని మహేంద్రగిరి నుంచి ప్రత్యేక వాహనంలో గురువారం షార్‌కు తీసుకొచ్చారు.