Share News

Joint Collaboration: ఇస్రో-జపాన్‌ సంయుక్తంగా చంద్రయాన్‌-5

ABN , Publish Date - Nov 25 , 2025 | 05:56 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), జపాన్‌... రెండు దేశాలూ సంయుక్తంగా చంద్రయాన్‌-5 మిషన్‌ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Joint Collaboration: ఇస్రో-జపాన్‌ సంయుక్తంగా చంద్రయాన్‌-5

  • ఇస్రో చైర్మన్‌ను కలిసిన జపాన్‌ అంతరిక్ష విధాన కమిటీ ఉపాధ్యక్షుడు

సూళ్లూరుపేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), జపాన్‌... రెండు దేశాలూ సంయుక్తంగా చంద్రయాన్‌-5 మిషన్‌ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్‌ జాతీయ అంతరిక్ష విధాన కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సాకు సునేటా ప్రతినిధుల బృందం రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. అనంతరం ఆయన ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌తో బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జపాన్‌-ఇస్రో ఉమ్మడిగా చేపట్టబోయే చంద్రయాన్‌-5 మిషన్‌ ప్రయోగం, ఉమ్మడి కార్యకలాలు, సహాయ సహకారాల గురించి చర్చించారు. అనంతరం జపాన్‌ ప్రతినిధుల బృందం బెంగళూరులోని యూఆర్‌ రావు ఉపగ్రహ తయారీ కేంద్రంతో పాటు అక్కడే ఉన్న ఇస్రో శాటిలైట్‌ ఇంటిగ్రేషన్‌ టెస్ట్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ (ఐఎస్ఐటీఈ) కేంద్రాన్ని సందర్శించింది. అక్కడున్న సాంకేతిక సౌకర్యాలను పరిశీలించింది. ఈ సందర్భంగా రెండు దేశాలూ కలిసి పనిచేసే విషయమై చర్చించినట్లు ఇస్రో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

Updated Date - Nov 25 , 2025 | 05:56 AM