‘భోగంపల్లె’కు నీటి జాడేదీ ?
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:54 PM
ఎన్నో ఏళ్లగా సాగు, తాగునీరందించిన భోగంపల్లె రిజ ర్వాయర్ వర్షాభావంతో నీరు అడుగంటాయి. 2015లో ఏకదాటిగా కురిసిన వర్షాలతో రిజర్వాయ ర్ నీటితో కళకళలాడేది. కొన్నేళ్లు వ్యవసాయానికి, పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా కాపాడ డం గమనార్హం.
మొరవలో పెరిగిన పిచ్చిమొక్కలు
గుంతలమయమైన ప్రాజెక్టు
కరుణించని వరుణుడు
ఎడారిని తలపిస్తున్న రిజర్వాయర్
ఇసుక తరలింపుతో రూపు మారిన వైనం
వాల్మీకిపురానికి తాగునీటి గండం తప్పదా..?
వాల్మీకిపురం, సెప్టెంబరు2(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లగా సాగు, తాగునీరందించిన భోగంపల్లె రిజ ర్వాయర్ వర్షాభావంతో నీరు అడుగంటాయి. 2015లో ఏకదాటిగా కురిసిన వర్షాలతో రిజర్వాయ ర్ నీటితో కళకళలాడేది. కొన్నేళ్లు వ్యవసాయానికి, పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా కాపాడ డం గమనార్హం. అయితే ప్రస్తుతం రిజర్వాయర్ ఎడారిని తలపిస్తోంది. దీంతో కరువు తాండవి స్తోందన్నట్లు కనబడుతోంది. వివరాల్లోకెళితే.....
కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవతో వాల్మీకిపురం పడమటి పొలిమేరల్లో భోగంపల్లె రిజర్వాయర్‌ను నిర్మించారు. దీంతో అటు సాగుకు, ఇటు పట్టణ ప్రజలకు తాగునీరు అందించేలా పథకం రూపొం దించారు. ఫలితంగా భవిష్యత్తులో ప్రజలకు సమ స్యలు రాకూడదని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసు కుని రిజర్వాయర్‌ను నిర్మించారు. 2015 చివరి మాసాల్లో ఏకదాటిగా కురిసిన వర్షాలతో రిజర్వా యర్ నీటితో కళకళలాడింది. దీంతో ఏళ్ల పాటు సాగు, తాగునీటి సమస్య తప్పింది.
పిచ్చిమొక్కలు పెరిగిన మొరవ ప్రాంతం
ఎన్నో ఏళ్లగా తాగు, సాగునీరందిస్తున్న రిజర్వాయర్‌లో ఒక్కసా రిగా నీటి జాడ కనుమరుగవుతుండడంతో రైతు లు పట్టణ ప్రజలు, సైతం తీవ్ర ఆవేదన చెందు తున్నారు. సమయానుకూలంగా వర్షాలు కురవక పోవడంతో రిజర్వాయర్ ప్రాంతం ఎడారిని తలపి స్తోంది. అంతే కాకుండా వైసీపీ కాలంలో భోగంప ల్లె రిజర్వాయర్ మొదలుకుని బాహుదా నది కాల్వ ప్రాంతాలను సైతం ఇసుక తవ్వకాలతో గుళ్ల చేసేశారు. రిజర్వాయర్ ప్రాంతంలో సైతం ఎవరి కి తోచింది వారిదే అన్న తడువుగా ఇసుకను రా త్రింబవళ్లు అక్రమ రవాణాకు తెరలేపడం గమనా ర్హం. అప్పట్లో అధికారులు కూడా వీటిపై నిఘా పెట్టకపోవడంతో ప్రస్తుతం పట్టణ ప్రజల దాహా ర్తికి గండం రానుందా అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఎటు చూసినా నీటి జాడ లేకపో వడం, మరోవైపు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణంతో భోగంపల్లె రిజర్వాయర్ రూపురేఖలు కోల్పోందనే చెప్పాలి. ప్రస్తుతం పట్ట ణ ప్రజలకు వారం, పదిరోజులకు ఒకసారి గాని తాగునీరు అందక అవస్థలకు గురవుతున్నారు.

రిజర్వాయర్‌లో చిన్నపాటి గుంతలకే పరిమితమైన నీరు
పరిస్థితులు ఇలాగే కొనసాగితే పట్టణ ప్రజలు తాగునీటికి తిప్పలు పడాల్సిందే అన్న అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్‌లో ప్రభు త్వం రెండు బోర్లను ఏర్పాటు చేసి పట్టణ ప్రజ లకు నీటిని సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్‌లో నీరు అడుగంటి పోవడం మున్ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చొరవ దృష్టిపెట్టాలని కోరుతున్నారు. వరుణుడు కరుణించి భోగంపల్లె రిజర్వాయర్ నీటితో కళకళ లాడాలని పొలిమేర దేవరులు, ఆలయాల్లో పూజ లు సైతం చేస్తుండడం గమనార్హం. ఈ విషయ మై పంచాయతీ ఈఓ రవీంద్రనాథ్‌ను వివరణ కోరగా ప్రస్తుతం రెండు బోరుబావుల నుంచి పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తు న్నామని రాబోయే రోజుల్లో సమస్య తలెత్తకుండా నూతన బోరుబావులు ఏర్పాటు, పట్టణ ప్రజలకు ప్రత్యా మ్నా యంపై దృష్టిపెడతామన్నారు. నీటి సరఫ రా తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి అనుమతుల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.