విద్యుత ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:15 AM
కర్నూలు విద్యుతశాఖ సర్కిల్ కార్యాలయం ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి.
యూనియన నాయకుడికి కీలక బాధ్యతలు
సీఎండీ అనుమతి లేకుండానే జేఏఓగా ఆర్డరు
నిబంధనలకు విరుద్ధ్దమన్న యూనియన నాయకులు
కల్లూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు విద్యుతశాఖ సర్కిల్ కార్యాలయం ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఓ యూనియనలో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగిని అడ్మినిస్ర్టేషన సెక్షన జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బదిలీ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో డిస్కం పరిధిలో నిర్వహించిన జేఏఓలకు సీఎండీ ఉత్తర్వులు అందించగా కర్నూలు నుండి పదోన్నతిపై తిరుపతికి వెళ్లిన అధికారి జేఏఓ బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి గొడవకు దిగినట్లు తెలిసింది. తక్షణమే ఆ ఆర్డరును రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధ్దంగా నిషేధం ఉన్నప్పటికీ ఆర్డరు ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పీఆర్‌ఈ సెక్షన జేఏఓగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కీలకమైన అడ్మినిస్ర్టేషన సెక్షనలో యూనియన నాయకుడికి జేఏఓగా బదిలీ చేయడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏడీఎం సెక్షనలో జేఏఓగా పనిచేస్తున్న రాఘవను పీఆర్‌ఈ సెక్షన జేఏఓగా బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన జేఏఓలకు సీఎండీ బదీలీ ఉత్తర్వుల అందిస్తే సదరు ఉద్యోగికి ఎస్‌ఈనే బదిలీ ఉత్తర్వులు ఇవ్వడంలో ఆంతర్యమేంటని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అడ్మినిస్ర్టేషన సెక్షనలో ఇప్పటి వరకు యూనియన నాయకుడికీ బాధ్యతలు ఇవ్వలేదు. నిబంధనలను తోసిపుచ్చి ఒక యూనియనకు మాత్రమే మంచి చేసేలా వ్యవహరించడం పట్ల ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనియన నాయకులకు అడ్మినిస్ర్టేషన భాధ్యతలు ఇస్తే, ఒక వర్గం యూనియనకే అధిక ప్రయోజనాలు, ఉద్యోగుల బదిలీలు, పాలనలో పారదర్శకత గోప్యతకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. సర్కిల్ ఆఫీసులో ఉండాల్సిన జేఏఓ పోస్టుల కంటే అధికంగా పోస్టులు ఏర్పాటు చేశారని ఆరోపణలున్నాయి. కర్నూలు సర్కిల్ పరిధిలో ఇలాంటి బదిలీలు చాలానే జరిగాయని, అవుట్ సోర్శింగ్ పోస్టులు మంజూరు చేశారని విచారణ జరిపితే అక్రమాలు బహిర్గతం అవుతాయని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఫ నా దృష్టికి రాలేదు: ఎస్‌ఈ ఆర్. ప్రదీప్‌కుమార్
కర్నూలు సర్కిల్ పరిధిలో జరిగిన జేఏఓ బదిలీల అక్రమాలు నా దృష్టికి రాలేదు. నిబంధనల మేరకు బదిలీల్లో డిస్కం సీఎండీ మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలి.