Former IPS N Sanjay: సంతకాలు ముందురోజు చేస్తా
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:01 AM
ఆసుపత్రిలో వైద్యుల అపాయింట్‌మెంట్ నేపథ్యంలో ఏసీబీ అధికారుల ముందు ఈనెల 19(శుక్రవారం)న చేయాల్సిన సంతకాన్ని...
ఏసీబీ కోర్టులో ఐపీఎస్ సంజయ్ పిటిషన్
విజయవాడ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలో వైద్యుల అపాయింట్‌మెంట్ నేపథ్యంలో ఏసీబీ అధికారుల ముందు ఈనెల 19(శుక్రవారం)న చేయాల్సిన సంతకాన్ని ముందురోజు గురువారమే చేస్తానని ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, వచ్చే వారం క్రిస్మస్ పండగ నేపథ్యంలో ఆ మరుసటి రోజు సంతకం చేయడానికి రాలేనని, దానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసే సమయంలో ఏసీబీ విధించిన షరతుల మేరకు ఆయన ప్రతి శుక్రవారం ఏసీబీ అధికారుల ముందు హాజరై సంతకం చేయాల్సి ఉంది. అయితే, ఈ నెల 19న వైద్యుల అపాయింట్‌మెంట్ ఉండటంతో కోర్టుకు రాలేనని సంజయ్ తెలియజేశారు. పాస్‌పోర్టు, ఈ-మెయిల్ ఐడీ, వాట్సాప్ నంబరును కోర్టుకు సమర్పించారు.