IPS Officer Sanjay: ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్‌పై 18న తీర్పు
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:00 AM
పీఎస్ అధికారి ఎన్.సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ నెల 18న తీర్పు వెలువరించనుంది. సంజయ్ అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్నప్పుడు..
విజయవాడ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ నెల 18న తీర్పు వెలువరించనుంది. సంజయ్ అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్నప్పుడు.. యాప్ అభివృద్ధి పేరుతో, సీఐడీలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన పేరుతోనూ.. కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంజయ్ పిటిషన్‌పై వాదప్రతివాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును 18వ తేదీన వెలువరిస్తామని న్యాయాధికారి పి.భాస్కరరావు తెలిపారు.