చంద్రబాబు బ్రాండ్‌తో పెట్టుబడులు: పయ్యావుల
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:47 AM
యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
అనంతపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎం చంద్రబాబు మంగళవారం కనిగిరి నుంచి ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అనంతపురంలోని సెరికల్చర్ కార్యాలయ ఆవరణలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని పయ్యావుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న సీఐఐ సదస్సులో దాదాపు 55 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారని తెలిపారు. పనిచేసే ప్రభుత్వం వస్తే ఎంత మార్పు వస్తుందో.. తమ ప్రభుత్వాన్ని చూసి గమనించాలని ప్రజలను కోరారు. గత పాలకుల పాపాల మూలంగా రాష్ర్టాన్ని మరిచిపోలేని భయం వెంటాడుతున్నా.. చంద్రబాబు బ్రాండ్‌ను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారు.