Inquiry Committee: కడప జైలులో మెడికల్ క్యాంపుపై విచారణ
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:01 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి కడప జైలులో తనను బెదిరించారన్న అప్రూవర్ దస్తగిరి ఆరోపణను...
చైతన్యరెడ్డి తనను బెదిరించాడన్నదస్తగిరి ఆరోపణలపై రంగంలోకి కమిటీ
కడప క్రైం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి కడప జైలులో తనను బెదిరించారన్న అప్రూవర్ దస్తగిరి ఆరోపణను నిగ్గుదేల్చేందుకు ఏర్పాటైన విచారణ కమిటీ రంగంలోకి దిగింది. కర్నూలుఎస్పీ విక్రాంత్‌పాటిల్ నాయకత్వం లోని టీమ్ మంగళవారం కడప జైలుకు వెళ్లింది. అప్పటి జైలు పర్యవేక్షణాధికారి ప్రకాశ్, జైలర్ రఫీ, డిప్యూటీ జైలర్ గాజుల మహ్మద్ రఫీలతో పాటు సిబ్బందిని, ఖైదీలను విచారించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ డాక్టర్లు లేకుండా ప్రైవేటు డాక్టర్లతో జైల్లో క్యాంపు ఏర్పాటు నిర్ణయం.. నాడు జైల్లో పనిచేస్తున్న డాక్టర్ పుష్పలతదా లేక పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయా అన్నది అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.