YS Viveka Murder Case : కడప జైలులో వివేకా హత్య కేసు నిందితులను బెదిరించడంపై విచారణ
ABN , Publish Date - Aug 12 , 2025 | 08:31 PM
కడప జైలులో వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితులను బెదిరించిన ఘటనపై విచారణ షురూ అయింది. జైలులో దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించినట్టు సమాచారం. రూ.20 కోట్లు ఎర చూపినట్లు, లేదా చంపుతామని భయపెట్టినట్లు..
అమరావతి, ఆగష్టు 12 : కడప జైలులో వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితులను బెదిరించిన ఘటనపై విచారణ షురూ అయింది. బెదిరింపుల ఘటనపై లోతైన దర్యాప్తు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జైలులో దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించినట్టు సమాచారం. అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. రూ.20 కోట్లు ఎర చూపినట్లు, లేదా చంపుతామని భయపెట్టినట్లు అభియోగాలు ఉన్నాయి. జైలులో వైద్యశిబిరం నిర్వహించి ఖైదీలను బెదిరించినట్లు కూడా సమాచారం. దీంతో నలుగురు అధికారులతో కమిటి ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక విషయాలు :
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన దర్యాప్తు కమిటీ నియామకం
కమిటీ సభ్యుడిగా కడప డీఎంహెచ్‌వో కె. నాగరాజు నియామకం.
కమిటి సభ్యుడిగా జైళ్ల సూపరింటెండెంట్ మహమ్మద్ ఇర్ఫాన్ నియామకం.
దర్యాప్తు కమిటీ సభ్యుడిగా కడప ఆర్‌డీవో జాన్ ఇర్విన్ నియామకం.
ఘటనపై గతేడాది సెప్టెంబరులో ఫిర్యాదు చేసిన వివేకా కుమార్తె సునీత.
ఘటనపై దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరిన సునీత.
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ నేతృత్వంలో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభం.
లోపాలు తెలుపుతూ దర్యాప్తు నివేదికను హోంశాఖకు ఇచ్చిన ఎస్.రాహుల్.
లోపాలకు బాధ్యులుగా ముగ్గురిని గుర్తించి చర్యలకు సిఫారసు చేసిన రాహుల్.
నివేదిక మేరకు అప్పటి జైలు అధికారులు ప్రకాష్, జవహర్ బాబుపై చర్యలు.
డిప్యూటీ సివిల్ సర్జన్ పుష్పలతను బాధ్యురాలిగా చేస్తూ ఇప్పటికే నోటీసులు.
వైద్య, పోలీసు, ఇతర విభాగాల ప్రమేయం తేలడంతో తదుపరి విచారణకు కమిటీ.
లోతుగా దర్యాప్తు చేసి వెంటనే హోంశాఖకు నివేదిక ఇవ్వాలని ఆదేశం.
అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించిన ప్రభుత్వం.