Interstate Robbers Arrested: అంతరాష్ట్ర దొంగలు అరెస్టు
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:19 AM
నంద్యాల, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు.
నంద్యాల టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): నంద్యాల, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వివరాలు వెల్లడించారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన పాణ్యం, సీసీఎస్ పోలీసులు మంగళవారం పిన్నాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు కేసుల్లో నిందితులని తేలింది. వారి నుంచి రూ.10.85 లక్షల విలువైన 11 తులాల బంగారు నగలు, 21 తులాల వెండి, రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.