Visakhapatnam: ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నేషనల్ నేవీ ఫ్లీట్ రివ్యూ
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:21 AM
వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు విశాఖపట్నంలో నేవీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎ్‌ఫఆర్)-2026 నిర్వహించనున్నారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు విశాఖపట్నంలో నేవీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)-2026 నిర్వహించనున్నారు. దీనికి రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు 135 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై మార్గదర్శనం చేశారు. సమావేశంలో సీపీ శంఖబ్రత బాగ్చి, నేవీ కమాండర్ వై.కె.కిశోర్ తదితరులు పాల్గొన్నారు.