Minister Satya kumar: ఆరోగ్యాంధ్ర కోసం..అంతర్జాతీయ నిపుణుల కమిటీ
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:40 AM
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బహుముఖ వ్యూహాలను సమీక్షించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు...
సీఎం నేతృత్వంలో 10 మంది సభ్యులతో ఏర్పాటు
‘స్వర్ణాంధ్ర మిషన్-2047’ లక్ష్యంగా సూచనలు
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బహుముఖ వ్యూహాలను సమీక్షించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వీలుగా 10 మంది అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పించే లక్ష్యంగా 2047 నాటికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు సీఎం చంద్రబాబు ఇప్పటికే విజన్ డాక్యుమెంట్‌ను విడుదలు చేశారు. వ్యాధుల వారీగా ప్రణాళికలు రూపొందించి ఆయా వ్యాధుల భారాన్ని తగ్గించడానికి నిపుణుల కమిటీ కృషి చేయాల్సి ఉంటుంది. కమిటీ డిసెంబరు మధ్యలో మొదటి సమావేశాన్ని సీఎం నేతృత్వంలో నిర్వహిస్తుంది. కమిటీ సభ్యులు.. పీటర్ పయట్; యూఎన్ ఎయిడ్స్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. డాక్టర్ సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్‌వో మాజీ శాస్త్రవేత్త.. ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టేవ్; డీన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, సింగపూర్ యూనివర్సిటీ.. డాక్టర్ కాంగ్; బిల్ అండ్ మిలిండా గేట్స్ పౌండేషన్ డైరెక్టర్.. డాక్టర్ నాగేశ్వరరెడ్డి, చైర్మన్ ఏఐజీ హాస్పిటల్స్, హైదరాబాద్.. ప్రొఫెసర్ మార్గరెట్ ఎలిజబెత్; హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్.. డాక్టర్ నిఖిల్ టాండన్, ప్రొఫెసర్ ఎయిమ్స్ (న్యూఢిల్లీ).. రిజ్వాన్ కొయిట్; చైర్మన్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్... శ్రీకాంత్ నాదముని; ఖోస్ల ల్యాబ్స్ వ్యవస్థాపకులు.. ఆర్తి అహుజా; ఐఏఎస్, కేంద్ర మాజీ కార్యదర్శి.