Share News

వీహెచఏల్లో అంతర్మథనం

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:19 PM

ఒకే ఉద్యోగం.. బాధ్యతలు మాత్రం మూడు.. ఓ వైపు సచివాలయ విధులు.. మరో వైపు వ్యవసాయ పనులు..

   వీహెచఏల్లో అంతర్మథనం
విధుల్లో గ్రామీణ ఉద్యాన సహాయకులు

క్లస్టర్‌ విభజనతో అయోమయం

సచివాలయ పనులు చేయలేమంటున్న ఆందోళన

గత ప్రభుత్వ నిర్ణయాలే శాపమంటూ ఆవేదన

ఉద్యాన శాఖలోనే పనిచేస్తామంటూ వినతి

ఒకే ఉద్యోగం.. బాధ్యతలు మాత్రం మూడు.. ఓ వైపు సచివాలయ విధులు.. మరో వైపు వ్యవసాయ పనులు.. ఉద్యానశాఖ బాధ్యతలతో సతమతమవుతున్నామంటూ గ్రామీణ ఉద్యాన సహాయకులు( వీహెచఏలు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కొన్ని బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని, వ్యవసాయ శాఖ నుంచి తొలగించి మాతృశాఖ అయిన ఉద్యాన శాఖలోనే కొనసాగించాలంటూ నిరసన బాట పట్టారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఉద్యాన శాఖ అధికారికి సైతం వినతిపత్రం అందజేశారు.

నంద్యాల ఎడ్యుకేషన, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతు సేవాకేంద్రాల రేషనలైజేషనతో గ్రామీణ ఉద్యాన సహాయకుల్లో అంతర్మధనం మొదలైంది. రైతులకు మరి న్ని సేవలందించేందుకు కూటమి ప్రభుత్వం రైతుసేవాకేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని రేషనలైజేషన చేపట్టి ప్రతిఉద్యోగి రైతుకు మరింత దగ్గర కావాలనే కసరత్తు జరుగుతోంది. రైతు సేవాకేంద్రాల్లో సిబ్బందిని మార్చడంతో పాటు అదనంగా ఉన్నవారిని వేరే ఇతర వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ముం దుకెళుతోంది. అటు సచివాలయ పనులను, ఇటు వ్యవసాయ పనులు, మరోవైపు ఉద్యానశాఖ పనులతో సతమతమవుతున్న వీహెచఏ (విలేజ్‌ హెర్టికల్చర్‌ అసిస్టెంట్‌) తమకు కస్టర్ల విభజనతో తీవ్ర అన్యాయం జరిగే అవకాశముందనే ఆందోళనతో జిల్లా ఉద్యానశాఖ కార్యాలయానికి కదిలారు. వ్యవసాయ శాఖ నుంచి విముక్తి కల్పించి మాతృశాఖ అయిన ఉద్యానశాఖలో విలీనం చేస్తూ ఉద్యాన అధికారుల నియంత్రణలో పనిచేసేలా అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని గ్రామీణ ఉద్యాన సహాయకులు(వీహెచఏలు) జిల్లా ఉద్యానశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.

పూర్తి ప్రక్షాళనకు..

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యాన పంటలు అత్యధికంగా ఉన్నచోట హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ను, సెరీకల్చర్‌ ఎక్కువగా ఉన్న చోట సెరీకల్చర్‌ అసిస్టెంట్‌ను వేయాలి. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా పంటలతో నిమిత్తం లేకుండా సిబ్బందిని కేటాయించారు. అగ్రికల్చర్‌ ఎక్కువగా ఉన్నచోట హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ను, హార్టికల్చర్‌ ఎక్కువగా ఉన్నచోట అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లను నియమించడంతో పారదర్శకత లోపించింది. దీంతో ప్రభుత్వం పూర్తి ప్రక్షాళనకు పూనుకుంది. సాగుకు అనుగుణంగా రెండు రైతు సేవాకేంద్రాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో మండల స్థాయిలో ఇద్దరిని కాని, క్లస్టర్‌ స్థాయిలో ఒక సహాయకుడి గాని నియమించేందుకు సన్నద్ధమవుతున్నారు.

217 క్లస్టర్‌లుగా ఏర్పాటు

నంద్యాల జిల్లాలో 411 రైతు సేవాకేంద్రాలు ఉండగా రెండు లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూములుండగా, 40వేల హెక్టార్లలో ఉద్యాన సాగు భూములున్నాయి. 101 మంది హార్టికల్చర్‌ అసిస్టెంట్‌లు, 310మంది అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లు పనిచేస్తున్నారు. రేషనలైజేషనలో భాగంగా 411 రైతుసేవాకేంద్రాలను 217 క్లస్టర్‌లుగా ఏర్పాటుచేస్తున్నారు. క్లస్టర్‌కు ఒక వీఏఏ కాని, ఒక వీహెచఏ కాని నియమించాలని అధికారులు భావిస్తున్నారు. అందులో గ్రామీణ వ్యవసాయ సహాయకులే అధికంగా ఉండడంతో 217 క్లస్టర్‌లో అధికంగా వారినే తీసుకునే అవకాశం ఉందని, హార్టికల్చర్‌ క్లస్టర్‌లు తక్కువగా ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని వీహెచఏలో ఆందోళన మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. ప్రతి క్లస్టర్‌లో ఒక గ్రామీణ వ్యవసాయ సహాయకున్ని, ఒక ఉద్యాన సహాయకున్ని నియమించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:19 PM