Share News

Gummidi Sandhya Rani: గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:55 AM

గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

Gummidi Sandhya Rani: గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

  • రూ.25 కోట్లతో 76 గోకులాలు..: మంత్రి సంధ్యారాణి

అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన కుటుంబాల జీవనోపాధి మెరుగుదలతో పాటు ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 76 గోకులాల ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రతి గోకులానికి 20 పశువుల పంపిణీ ద్వారా 10 మంది లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. గిరిజన రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం రూ.19 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సివిల్స్‌, బ్యాంకులు, రైల్వేలు, యూపీఎస్సీ, ఎస్‌ఎ్‌ససీ వంటి జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హత సాధించేలా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్టికల్‌ 275 కింద మంజూరైన నిధుల నుంచి పాడేరు ఐటీడీఏకు రూ.7 కోట్లు మంజూరు చేసి, జీకే వీధి, జీమాడుగుల ప్రాంతాల్లో ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్లకు అనుమతులిచ్చి తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా మకవరపు పాలెం మండలం సెట్టిపాలెం గ్రామంలో 11.85 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ురుకులాల్లో 324 మంది సిబ్బంది, ఆశ్రమ పాఠశాలల్లో 709 మంది వంట సిబ్బంది, 1,080 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.60 కోట్లు వ్యయం చేస్తున్నామని వివరించారు.

Updated Date - Dec 17 , 2025 | 05:56 AM