Share News

Chairman K Madhu Murthy: ఇన్‌స్టిట్యూట్‌ ఇండస్ట్రీ కనెక్ట్‌ పోర్టల్‌ ప్రారంభం

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:30 AM

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఇండస్ట్రీ కనెక్ట్‌ పోర్టల్‌ను ఉన్నత విద్యామండలి...

Chairman K Madhu Murthy: ఇన్‌స్టిట్యూట్‌ ఇండస్ట్రీ కనెక్ట్‌ పోర్టల్‌ ప్రారంభం

  • విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కల్పించే పరిశ్రమలకు ఆహ్వానం

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు ఇన్‌స్టిట్యూట్‌-ఇండస్ట్రీ కనెక్ట్‌ పోర్టల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి బుధవారం ప్రారంభించారు. దీనిపై ఆసక్తి ఉన్న పరిశ్రమలు ఈనెల 5 నుంచి 22వ తేదీ వరకు ఈ వెబ్‌సైట్‌ (ఠీఠీఠీ.జీజీఛి.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ) లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో సూచించారు. స్టైఫండ్‌ ఉన్న లేదా స్టైఫండ్‌ లేని ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఒకసారి వెబ్‌సైట్‌ ద్వారా అనుమతి పొందితే ఇంటర్న్‌షి్‌పలు ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 03:30 AM