Share News

Supreme Court: ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ అక్టోబరు 29కి వాయిదా

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

Supreme Court: ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ అక్టోబరు 29కి వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) సుదీర్ఘంగా విచారించింది. తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్‌కు రూ.18 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పును ఆ సంస్థ 2023 మే 15న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ మన్మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణను అక్టోబరు 29కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Updated Date - Sep 25 , 2025 | 07:00 AM