Farmer Innovation: ఐడియా అదిరిందిగా..
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:33 AM
పొలానికి కూలీలను తీసుకెళ్లడానికి, పంట ఉత్పత్తులను ఇంటికి తీసుకుని రావడానికి ఓ రైతు కొత్తగా ఆలోచించాడు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరిపురానికి చెందిన రైతు...
ఇంటర్నెట్ డెస్క్: పొలానికి కూలీలను తీసుకెళ్లడానికి, పంట ఉత్పత్తులను ఇంటికి తీసుకుని రావడానికి ఓ రైతు కొత్తగా ఆలోచించాడు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరిపురానికి చెందిన రైతు ఆడారి మోహన్‌కు ఐదెకరాల పొలం ఉంది. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పొలంలో పని చేయడానికి 10 మంది కూలీలు అవసరం. వీరిని పొలానికి తీసుకెళ్లిన ప్రతిసారీ రూ.200 ఖర్చవుతోంది. ఈ ఖర్చును తగ్గించుకోడానికి మోహన్ కొత్తగా ఆలోచించారు. తన ఆలోచనను వర్క్‌షాపు నిర్వాహకుడికి చెప్పి.. తన బైక్‌కు చిన్న ట్రాలీలాంటిది చేయించుకున్నారు. ఇప్పుడు పావు లీటరు పెట్రోలుతో.. ఆటో కోసం ఎదురుచూసే పని లేకుండా కూలీలను పొలానికి తీసుకెళ్తున్నానని రైతు చెప్పారు. పంట ఉత్పత్తులను ఇంటికి తెచ్చుకునేందుకూ ఈ ట్రాలీ ఉపయోగపడుతోందని, దీని తయారీకి రూ.15వేలు అయిందని తెలిపారు.
- ఎస్.కోట రూరల్, ఆంధ్రజ్యోతి