Chittoor District: గాయపడిన ఏనుగు ఎస్వీ జూపార్కుకు తరలింపు
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:44 AM
చిత్తూరు జిల్లా మండల పరిధిలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒంటరి ఏనుగును తిరుపతిలోని ఎస్వీ జూ పునరావాస కేంద్రానికి...
యాదమరి/మంగళం(తిరుపతి), డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా మండల పరిధిలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒంటరి ఏనుగును తిరుపతిలోని ఎస్వీ జూ పునరావాస కేంద్రానికి సోమవారం తరలించారు. రెండ్రోజుల క్రితం డీకే చెరువు సమీపంలోని కమ్మపల్లి అటవీ బీట్ గుడ్డివానిచెరువు వద్ద ఏనుగు జారిపడి కాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కుంకీ ఏనుగులు కృష్ణ, అభిమన్యు సహాయంతో దెబ్బతిన్న ఏనుగును భారీ క్రేన్ సాయంతో లారీలోకి ఎక్కించారు. సోమవారం మధ్యాహ్నానికి తిరుపతి జూలోని ఎన్‌క్లోజర్‌కు తరలించి చికిత్స ప్రారంభించారు.