Share News

కరువు సీమలో పారిశ్రామిక ప్రగతి

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:27 AM

పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో కర్నూలు జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

   కరువు సీమలో  పారిశ్రామిక ప్రగతి
బ్రాహ్మణ కొట్కూరులో పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి టీజీ భరత, ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, కలెక్టర్‌ ఏ.సిరి

రూ.3,262 కోట్లు పెట్టుబడులతో జిల్లాలో ఆరు పరిశ్రమలు

6,500 మందికి ఉద్యోగావకాశాలు

వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

ఓర్వకల్లు ఇండసి్ట్రయల్‌ స్మార్ట్‌ సిటీలో పలు పరిశ్రమలు

మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత శంకుస్థాపన

కర్నూలు/ఓర్వకల్లు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో కర్నూలు జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆరు పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం వర్చువల్‌ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ద్వారా జిల్లాకు రూ.3,262 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. నిర్మాణాలు పూర్తి అయి కార్యరూపం దాల్చితే దాదాపుగా 6,500 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఓర్వకల్లు ఇండసి్ట్రయల్‌ స్మార్ట్‌ సిటీ హబ్‌ పరిధిలో బ్రహ్మణపల్లి, గుట్టపాడు వద్ద 206 ఎకరాల్లో రూ.2,750 కోట్లు పెట్టుబడితో నిర్మించనున్న రిలయన్స కన్స్యూమర్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌, ఆర్‌పీఎస్‌ ఇండసీ్ట్రస్‌ లిమిటెడ్‌, సగాచి ఇండసీ్ట్రస్‌ లిమిటెడ్‌లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమలు ద్వారా 2,835 మందికి ఉద్యోగాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్థానికంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కలెక్టర్‌ డాక్టర్‌ సిరిలు శిలాఫలకాలను ఆవిష్కరించారు. పెద్దకడుబూరు మండలం హెచ.మురవణి, దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామాల్లో 76.24 ఎకరాల్లో రూ.30.62 కోట్లతో అభివృద్ధి చేయబోతున్న ఎంఎస్‌ఎంఈ పార్కులకు కూడా సీఎం చంద్రబాబు వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయంలో రూ.100 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న మెల్‌సా్ట్రర్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైనేషనకు చంద్రబాబు శంకుస్థాపన చేయగా, స్థానికంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన లిమిటెడ్‌ ఎండీ ప్రవీణ్‌ ఆదిత్య, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కామర్‌లు శిలాఫలకం ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో రూ.97 కోట్లలో 1.2 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వర లాడ్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించే అధునిక హోటల్‌, రెస్టారెంట్‌కు నిర్మాణానికి సీఎం చంద్రబాబు వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఎమ్మిగనూరు, ఆదోని ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ పార్థసారథి, మంత్రాలయం టీడీపీ ఇనచార్జి ఎన.రాఘవేంద్రరెడ్డిలు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాయలసీమ కరువు ప్రాంతం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఓర్వకల్లు కేంద్రంగా డోన సిటీ రాబోతుందని, దేశంలో తొలి డ్రోన సిటీ అని గుర్తు చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పానీయాల ప్లాంట్‌ను రిలయన్స సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నామని, ఇది ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందన్నారు. రిలయన్స ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో పరిశ్రమలు

- పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వల్లే పరిశ్రమలు వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. బ్రాహ్మణపల్లె వద్ద రూ.3 వేల కోట్లతో నిర్మించే రిలయన్స కన్సూమర్స్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ను, గుట్టపాడు గ్రామ సమీపాన సికాచి ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ ఆర్‌పీఎస్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ నిర్మాణాలకు సీఎం చంద్రబాబు వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. మంత్రి టీజీ భరత, ఎమ్మెల్యే గౌరు చరితలు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడారు. ఈ పరిశ్రమలు వల్ల స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా ఇక్కడే స్కిల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ ప్రతి నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలలు, స్కిల్‌ సెంటర్లను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నారన్నారు. గుట్టపాడు గ్రామ సమీపంలో సిగాచీ కెమికల్స్‌ కూడా రాబోతోందన్నారు. సీఎం చంద్రబాబు విజన కలిగిన నాయకుడని, ఓర్వకల్లులో రెడ్‌జోన కింద అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. అదే జరిగితే పలు కెమికల్‌ పరిశ్రమలు వస్తాయన్నారు. రూ.23 వేల కోట్లతో సెమికండక్టర్స్‌ పరిశ్రమ, రూ.7వేల కోట్లతో ఆగస్త్య సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు జరగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ డా.సిరి మాట్లాడుతూ ఆరు ప్రాజెక్టులు, మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులు ముఖ్యమంత్రి సమక్షంలో శంకుస్థాపన చేశారన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్లు ఇండసి్ట్రయల్‌ స్మార్ట్‌ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందని, వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా మంత్రి టీజీ భరత చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్‌ కుమార్‌, ఏపీఐఐసీ జడ్‌ఎం మధుసూదన రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌, రిలయన్స సంస్థ ప్రతినిధి అర్బన బసు, కిషనపారిశ్రామికవేత్త సుబ్బారెడ్డి, కార్పొరేషన డైరెక్టర్లు, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపీడీవో నాగ అనుసూయ, నాయకులు మోహన రెడ్డి, గోవిందరెడ్డి, సుధాకర్‌ రెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, చంద్రపెద్ద స్వామి, బ్రాహ్మనపల్లెనాగిరెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, సుధాకర్‌రావు పాల్గొన్నారు.

ఫ పరిశ్రమలు ద్వారా ఉపాధి కల్పన

- వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ఓర్వకల్లు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేస్తున్న మెల్‌సా్ట్రర్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైనేషనకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన లిమిటెడ్‌ మేనేజర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వాణిజ్య ప్రైవేటు పైలట్లకు శిక్షణ ఇచ్చే ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన డీజీసీఏ ఆమోదిత కోర్సులు, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స ప్రైవేటు లైసెన్స మల్టీ ఇంజన రేటింగ్‌ ఇనసు్ట్రమెంట్స్‌ తదితర కోర్సుల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా వంద మందికి, పరోక్షంగా 250 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది జూలై నాటికి నిర్మాణాలు పూర్తి చేసి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మెల్‌స్టాల్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కష్యప్‌, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌, డీఐవో ప్రవీణ్‌ రెడ్డి, డీఈ అమృత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:27 AM