AP Cabinet Subcommittee: నవంబరులో భాగస్వామ్య సదస్సు
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:26 AM
పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నవంబరు 14, 15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
14, 15 తేదీల్లో ఏయూలో నిర్వహణకు నిర్ణయం
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నవంబరు 14, 15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. భాగస్వామ్య సదస్సుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు పి. నారాయణ, టీజీ భరత్, కందుల లక్ష్మీ దుర్గేశ్, కొల్లు రవీంద్ర తదితరులు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో గురువారం రెండోసారి సమావేశమయ్యారు. వ్యక్తిగత కారణాలతో మంత్రులు లోకేశ్, గొట్టిపాటి రవికుమార్ హాజరు కాలేదు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సులో భాగంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయుల్లో రోడ్ షోలు చేపట్టాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చేనెల రెండోవారంలో ఢిల్లీలో సన్నాహక సదస్సును నిర్వహించాలని తీర్మానించారు.