Vijayawada: పోటెత్తిన ఇంద్రకీలాద్రి
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:31 AM
విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి లక్షా 20 వేల మందికిపైగా...
భారీ సంఖ్యలో వచ్చిన భవానీలు నేటితో దీక్షల విరమణ
విజయవాడ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి లక్షా 20 వేల మందికిపైగా దుర్గమ్మను దర్శించుకున్నారని అంచనా. సోమవారం ఐదవరోజు దీక్షల విరమణ ముగియనుండటంతో రద్దీ పెరుగుతోంది. ఆదివారం కొండదిగువన కనకదుర్గానగర్, వన్‌టౌన్ రధం సెంటర్, కెనాల్ రోడ్డు, బ్రాహ్మణవీధి, ప్రకాశం బ్యారేజీ, విఎంసీ కార్యాలయం, తదితర ప్రాంతాలలో భవానీలు, భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.