Share News

India BRICS Forum 2025: అడవుల రక్షణకు మహిళల చిప్కో ఉద్యమం

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:58 AM

భారత్‌లోని గ్రామీణ మహిళలు అడవులను కాపాడుకునేందుకు 1970ల్లో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు’ అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు.

India BRICS Forum 2025: అడవుల రక్షణకు మహిళల చిప్కో ఉద్యమం

బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం భేటీలో ఎంపీ శబరి

న్యూఢిల్లీ, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు చర్చలు చేపట్టకముందే పర్యావరణ పరిరక్షణ కోసం భారత్‌ కృషి చేసింది. భారత్‌లోని గ్రామీణ మహిళలు అడవులను కాపాడుకునేందుకు 1970ల్లో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు’ అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. బ్రెజిల్‌లో జరుగుతున్న 11వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం భేటీలో భారత్‌ తరఫున లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నాయకత్వంలోని ఎంపీల బృందం పాల్గొంది. ఎంపీ శబరి ఈ బృందంలో సభ్యురాలు. ‘వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మహిళల సాధికారత’ అనే అంశంపై జరిగిన చర్చలో శబరి మాట్లాడారు. వాతావరణ లక్ష్యాలపై భారత్‌ సాధించిన పురోగతిని వివరించారు. భారత్‌లో 26 శాతం అడవులు ఉన్నాయని, గత మూడేళ్లలో 23 చిత్తడి నేలల ప్రాంతాలు రామ్‌సర్‌ సైట్‌లుగా గుర్తింపు పొందాయని తెలిపారు.

Updated Date - Jun 05 , 2025 | 05:59 AM