Indian Naval Ships: స్లినెక్స్-25కు భారత్ నౌకలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:58 AM
శ్రీలంకలో జరుగుతున్న శ్రీలంక, ఇండియా నేవల్ ఎక్సర్‌సైజ్(స్లినెక్స్-25)కు భారత్ నుంచి గైడెడ్ మిస్సైల్ డెస్ర్టాయర్ ఐఎన్‌ఎస్ రాణా, ఫ్లీట్ ట్యాంకర్ ఐఎన్‌ఎస్ జ్యోతి తరలివెళ్లాయి.
శ్రీలంకకు ఐఎన్‌ఎస్ రాణా, జ్యోతి
14 నుంచి 18 వరకు విన్యాసాలు
విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీలంకలో జరుగుతున్న శ్రీలంక, ఇండియా నేవల్ ఎక్సర్‌సైజ్(స్లినెక్స్-25)కు భారత్ నుంచి గైడెడ్ మిస్సైల్ డెస్ర్టాయర్ ఐఎన్‌ఎస్ రాణా, ఫ్లీట్ ట్యాంకర్ ఐఎన్‌ఎస్ జ్యోతి తరలివెళ్లాయి. శ్రీలంక నేవీ తరఫున తీర ప్రాంత గస్తీ నౌకలు ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ గజబాహు, విజయబాహు పాల్గొంటున్నాయి. ఈ నెల 14న మొదలైన సంయుక్త విన్యాసాలు 18వ తేదీ వరకు జరుగుతాయని తూర్పు నౌకాదళం వెల్లడించింది.