Indian Navy: అమెరికన్ సెయిలర్లను కాపాడిన ఇండియన్ కోస్ట్‌గార్డ్
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:46 AM
అమెరికా నుంచి యాచ్‌లో సెయిలింగ్ చేసుకుంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అండమాన్ నికోబార్ దీవుల సమీపాన ప్రమాదంలో చిక్కుకోగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెళ్లి రక్షించింది.
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అమెరికా నుంచి యాచ్‌లో సెయిలింగ్ చేసుకుంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అండమాన్ నికోబార్ దీవుల సమీపాన ప్రమాదంలో చిక్కుకోగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెళ్లి రక్షించింది. ఇద్దరు అమెరికన్లు ‘సీ ఏంజిల్’ సెయిలింగ్ చేస్తూ వస్తుండగా అండమాన్‌కు ఆగ్నేయంగా 52 నాటికల్ మైళ్ల దూరంలో.. వాతావరణంలో మార్పుల వల్ల వారి యాచ్ పనిచేయడం ఆగిపోయింది. తమను రక్షించాలని వారు సమాచారం పంపడంతో కోస్టుగార్డుకు చెందిన ఐసీజీ రాజ్‌వీర్ నౌక వెళ్లి వారిని భారీ గాలుల మధ్య రక్షించింది. శుక్రవారం ఉదయం యాచ్‌తో సహా క్యాంప్‌బెల్ హార్బర్‌కు చేర్చినట్టు కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయి.