Samudra Pratap: సముద్ర ప్రతాప్..!
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:09 AM
భారత సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఇండియన్ కోస్ట్‌గార్డ్ తొలి నౌకను అందుబాటులోకి తీసుకువచ్చింది
సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు నౌక
తొలిసారి అందుబాటులోకి తీసుకువచ్చిన ఇండియన్ కోస్ట్‌గార్డ్
విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భారత సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఇండియన్ కోస్ట్‌గార్డ్ తొలి నౌకను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘సముద్ర ప్రతాప్’ (యార్డ్ 1267) పేరుతో గోవా షిప్‌యార్డులో నిర్మించిన ఈ నౌకను ఇండియన్ కోస్ట్‌గార్డ్ డీఐజీ వీకే పర్మార్, గోవా షిప్‌యార్డ్ సీంఎండీ బ్రజేశ్‌కుమార్ ఉపాధ్యాయ మంగళవారం గోవాలో ప్రారంభించారు. కోస్టు గార్డ్ నౌకలన్నింటిలోకీ ఇది పెద్దదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీనిని 114.5 మీటర్ల పొడవు, 16.5 మీటర్ల వెడల్పు, 4,170 టన్నుల బరువుతో నిర్మించారు. అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ సిస్టమ్‌తో పాటు రిమోట్ కంట్రోల్డ్ గన్స్ ఏర్పాటుచేశారు. సముద్రంలో ఆయిల్ స్పిల్స్, యాక్టివ్ కెమికల్స్‌ను ఇది గుర్తిస్తుంది. వాటిని విశ్లేషించే లేబొరేటరీ కూడా నౌకలోనే ఏర్పాటుచేయడం విశేషం. ఆత్మనిర్భర్ భారత్ కింద దీనిని దేశీయంగానే రూపొందించారు.