Quantum Valley: దేశంలోనే తొలి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:14 AM
దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి...
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా మారుతుందన్నారు. సచివాలయంలో.. స్టార్టప్‌లు, విద్యా, పరిశోధనా సంస్థలు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఐటీ రంగ నిపుణులతో చంద్రబాబు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఫెసిలిటీ సెంటర్‌లో క్వాంటమ్ విడిభాగాల పరీక్ష, బెంచ్ మార్కింగ్, వర్గీకరించడం వంటి పనులు నిర్వహిస్తారని ఐటీ నిపుణులు సీఎంకు వెల్లడించారు.