Incubation Hub for Startups: మెడ్‌టెక్ జోన్‌లో స్టార్ట్‌పలకు ఇంక్యుబేషన్ హబ్
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:23 AM
విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో స్టార్ట్‌పల కోసం లక్ష చదర పు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ హబ్‌ను సిద్ధం చేశారు..
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో స్టార్ట్‌పల కోసం లక్ష చదర పు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ హబ్‌ను సిద్ధం చేశారు. ఇక్కడి వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనంలో దీనిని ఏర్పాటు చేశారు. సర్జికల్ సూది నుంచి సర్జికల్ రోబోటిక్స్ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వస్తువుల తయారీకి ప్రయత్నించే భారతీయ స్టార్ట్‌పలకు ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దారు. వినూత్నఆలోచనలతో వచ్చేవారికి అండగా ఉంటుందని మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్రశర్మ పేర్కొన్నారు.ఙ