Share News

పులివెందులలోనూ పూర్తిగా కట్టలేదు: పట్టాభి

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:38 AM

గత ప్రభుత్వంలో జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా మెడికల్‌ కాలేజీని అసంపూర్తిగా వదిలేశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.

పులివెందులలోనూ పూర్తిగా కట్టలేదు: పట్టాభి

అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా మెడికల్‌ కాలేజీని అసంపూర్తిగా వదిలేశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. జగన్‌ హయాంలో రూ.8,480 కోట్ల నిర్మాణ వ్యయంతో 17 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేశారన్నారు. ఐదేళ్లలో వాటిపై కేవలం రూ.1451 కోట్లు ఖర్చు చేశారని, ఆ మొత్తంలోనూ రూ.975 కోట్లు కేంద్ర ప్రభుత్వానివని తెలిపారు. ఐదేళ్ల పాలనలో కేవలం 5 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించి, వాటినీ సగంలో వదిలేశారని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పట్టాభి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో 10 కాలేజీలను నిర్మిస్తుందని, వీటిని లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తారని, ఇందులో దోపిడీ ఎక్కడుందని ప్రశ్నించారు.

Updated Date - Sep 07 , 2025 | 04:39 AM