MP Shabari: బేడ బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చండి
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్‌లో బేడ బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ను ఎంపీ బైరెడ్డి శబరి కోరారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో బేడ బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ను ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో బేడ బుడగ జంగం కులానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, ఈ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం, సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అని శబరికి సూచించానన్నారు. కాగా, కేంద్ర మంత్రి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లడంపై బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు టీ మనోహర్.. శబరికి ధన్యవాదాలు తెలిపారు.